gold investment in telugu, stock market telugu , u2dt





Types of investments in India | stock market Telugu 


Recurring deposits:- అంటే... మీరు మీ నెలవారీ సంపాదనలో ప్రతినెలా కొంత డబ్బు ఆ అకౌంట్లో జమ  చేసుకోవడం. ఇది సగటున సంత్సరానికి 6 నుండి 7 శాతం వరకు మీ డబ్బుని పెంచుతుంది.


Pros & cons అన్నీ Fixed Deposite లో ఉన్నట్లే ఉంటాయి. fixed deposit telugu


Gold:- మీలో కొందరు ఆశ్చర్యపోయి ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే.. బంగారాన్ని అభరణంగానే చూస్తారు తప్ప పెట్టుబడి సాధనంగా చూసి ఉండరు. బంగారం పై పెట్టుబడి చేసేవారు కుడా చాలామంది ఉంటారు.

అనుకూల అంశాలు (PROS):- 

Stable income :- బంగారానికి మరియు ఇతర ఆర్థిక పరిస్థితులకు కో రిలేషన్ ఉండదు.అంటే దేశం తాలూకు ఆర్థికస్థితి దెబ్బతింటుంన్నాకుడా బంగారం విలువ పెరుగుదలలో ఎక్కువగా మార్పు ఉండదు. అందుచేత ఏది ఏమైనప్పటికీ మీకు స్థిరమైన ఆదాయం ఇస్తుంది.


 Liquidity :- మనకు అవసరం  వచ్చినపుడు సునాయాసంగా డబ్బు రూపంగా మార్చుకోవచ్చు.


బంగారం ఒక సుతిమెత్తని లోహం అవ్వడం వల్ల చిన్న ..చిన్న పొదుపు దారులు చిన్న చిన్న ముక్కల్లో కొనుక్కొని దాచుకోవచ్చు. అవసరం వచ్చినపుడు ఇంకా చిన్న ముక్కలు చేసి అమ్ముకోవచ్చు...


ప్రతికూల అంశాలు (Cons):- 


  బంగారంలోపెట్టుబడి పెట్టడం వల్ల మన రూపాయి విలువ కొంత పడిపోతుంది అనే చెప్పుకోవాలి.. ఎందుకంటే మన దేశం cruid oil తో పాటు బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఎదైనా దేశానికి దిగుబడులు ఎక్కువగా ఉండి ఎగుబడులు తక్కువగా ఉంటే  దేశం  యొక్క కరెన్సీ విలువ పడిపోతుంది.


 అందుకనే గవర్నమెంట్ GOLDBEES ను ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా మీరు ఫిజికల్ గోల్డ్ ఎలా కొంటున్నారో.... Virtual గా కూడా ETF (exchange traded fund) ద్వారా కొనొచ్చు. దీనివల్ల కొన్న బంగారం స్వచ్ఛమైనదో కాదో అని... బంగారం దొంగతనం అవుతోంది ఏమో అని.... దాయటానికి వేరే లాకర్ లాంటి ఖర్చులు అవుతాయో అని ఆలోచించాల్సిన అవసరం లేదు...


 బంగారంపై సంత్సరానికి 10% నుండి 12% ఆదాయం ఉంటుంది.

Types of investments in india | stock market telugu 


Real estate :-  మన దేశంలో IT sector boom వచ్చాక రియల్ ఎస్టేట్ ఒక ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారింది. ఆదాయంలో అయినా.... లాభాలు తేవటంలో అయినా దీనికి మించిన పెట్టుబడి ఇప్పటివరకూ రాలేదు అనే చెప్పుకోవాలి. దీనికి ముఖ్యకారణం ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అవ్వడం. మరియు మన దేశంలో విపరీతమైన corruption ఉండటం.


Real estate, investments, investment types, earn money online free, money market,





 

ఉదాహరణకు ఒకరి దగ్గర కోటిరూపాయల బ్లాక్ మనీ ఉన్నట్లయితే ఒక అసెట్ కొని.. దానిని 40లక్షలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ అసెట్ అమ్మినవారి దగ్గరకు వచ్చిన ఆ కోటి రూపాయల బ్లాక్ మనినీ బ్యాంకులో వెయ్యలేరు... బంగారాన్ని కొనలేరు ఎందుకంటే బంగారాన్ని కొనాలంటే PAN CARD ని జతచేయాలి. అందుకని తక్కువ regulations ఉన్న రియల్ ఎస్టేట్ లోనే మళ్లీ పెట్టాలి. అంటే మళ్లీ ఎదో ఒక అసెట్ కొనాలి. వాళ్లకు నచ్చిన అసెట్ ఎలాగయినా తీస్కువడానికి ఉన్న వల్యూ కంటే ఎక్కువ మనీ ఇచ్చి ఆ బ్లాక్ మనీతో కొంటుంటారు. ఈ ట్రాన్సాక్షన్ లో కుడా ఇందాక చెప్పినట్టు బ్లాక్ మని మారటం వల్ల మళ్లీ అమ్మిన వాళ్ళు అదే డబ్బులను రియల్ ఎస్టేట్లో పెట్టడం చేస్తారు.... అలా....అలా... రియల్ ఎస్టేట్ ధరలు పెరగటం మొదలుపెట్టాయి. అయితే demonetization లాంటి డెసిషన్ అంటే వల్ల రియల్ ఎస్టేట్ కి కొంత బ్రేకులు పడ్డాయనే చెప్పుకోవాలి. 


అనుకూల అంశాలు (PROS):-

ముందుగా చదివినట్టు ఇందులో వచ్చే లాభాలు మరే ఇన్వెస్ట్మెంట్స్ లోనూ వచ్చి ఉండవు.

ఇందులో విజయవంతులు అవటానికి ఎవరైనా డిగ్రీలు అవసరం లేదు..technical అనాలసిస్ చెయ్యాల్సిన పనిలేదు. మీరు అదృష్టవంతులు,సుక్ష్మబుద్ధితో ఆలోచించేవారు...లేదంటే ఏ ఏరియాలో ఏ డెవలప్ మెంట్ రాబోతుందో ముందుగానే తెలిసే సెటప్ మీ దగ్గర ఉంటే మీరే విజేతలు కావొచ్చు. అందుకే....! డిగ్రీలు కానీ చదివిన వారి కంటే జీవితాన్ని చదివిన వారే రియల్ ఎస్టేట్ లో సువర్ణపతాకం ఎగరవేసారు. మిడిల్ క్లాస్ వారికి కమర్ష్యల్ అసెట్స్ కన్నా.... అన్ని అప్రువల్స్ ఉన్న రెసిడెన్షియల్ లాండ్ లేదా ప్లాట్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే విపరీతమైన రిటర్న్స్ ఉండవుకాబట్టి మాఫియా లాంటి తలనొప్పి ఉండకపోవడం మరియు government ఎలాంటి initiation తీసుకున్నా మీకు ప్రోబ్లం ఉండదు.


ప్రతికూల అంశాలు(cons):- 

ఊహించని విధంగా పెరిగిన ధరల దగ్గర మాఫియా లేదా ఇంకా కొన్ని తలనొప్పులు రావొచ్చు. అందుకనే మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కొంత రిస్కీ అనే చెప్పుకోవాలి.


 ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి.


 government వాళ్ళు తీసుకొనే నిర్ణయాలు బట్టి మీ లాండ్ కి పెద్ద ఎదురు దెబ్బ తగలొచ్చు (ex:- road extension, new govt building construction ....)


 చాలా వరకు దీని నుంచి ఆదాయం తెచ్చుకోవాలి అంటే కొన్ని సంవ్సరాలపాటు వేచి ఉండవలసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ తరం వారు పెట్టుబడి పెడితే తరువాతి తరం వారు లేదా... ఆ తరువాతి తరం వారు వారు ఆ లాభాలను అనుభవించవచ్చు.


  లిక్విడిటీ చాలా తక్కువ, మనకు డబ్బులు అవసరం వచ్చినపుడు ప్రాపెర్టీని అమ్ముకుందాం అనుకుంటే ఉన్న దాని కన్న తక్కువ రేటుకు ఇస్తాము అన్నా.. సరే కొనేవారు ఉండకపోవచ్చు.


 రియల్ ఎస్టేట్ నీ ఒక్క మాట లో చెప్పాలి అంటే ఎక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు వచ్చే ఒక ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. ( High risk &high return with high investment)


మరికొన్ని రకాల పెట్టుబడి సాధనాల గురించి

మిగతా ఆర్టికల్ లో తెలుసుకొందాం....



ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.


                                                    *********ధన్యవాదాలు*********