Types of investments telugu | పెట్టుబడి సాధనాలలో రకాలు -3 |stock market Telugu


Bonds:- ప్రతి కంపెనీకి తన వ్యాపారాన్ని నడపాలి అంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం equity market లేదా debt మార్కెట్లకు వెళ్ళాలా అనేది తమ ప్లానింగ్ బట్టి ఉంటుంది.

ఇప్పుడు ఒక కంపనీ debt మార్కెట్ లోకి వెళ్లి బాండ్స్ issue  చేసింది అనుకోండి. ఆ బాండ్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

Example of bonds Bond meaning Bond Glossary Bonds investopedia Bond yield How to invest in bonds Investment in bonds Bond trading jargon Discount Premium,Coupon Interest Rate,Maturity. Rates of Interest,Call Provision,Bid Price

ఎదైనా కంపనీ బాండ్స్ issue చేసినపుడు ఒక బాండ్ విలువ ఇంత అని ఉంటుంది. దానినే ఫేస్ వాల్యూ( face value)  అంటారు.


సంవత్సరానికి ఇంత శాతం వడ్డీ అని ఒప్పందం చేస్తుంది. దానినే కూపన్ వాల్యూ అంటారు. ఇన్ని సంవత్సరాల తరువాత మీ అసలు ని తిరిగి ఇస్తాము అంటారు. దానినే maturity time అంటారు.


ఉదాహరణకి NTPC వాళ్ళు ఫేస్ వాల్యూ 1000 రూపాయలు ఉన్న బాండ్స్ issue చేశారు అనుకోండి. అందులో మీరు జనవరి 2019 లో ఒక లక్ష రూపాయలు పెట్టి 100 బాండ్లు కొన్నారు అనుకోండి. వాళ్ళ కూపన్ వాల్యూ 10శాతం అంటే.... సంవత్సరానికి పదివేలు ఇస్తారు.


అలాగే maturity time 10 సంవత్సరాలు అని చెపుతారు ఆ కంపనీ వారు. అంటే ఆ లక్ష (అసలు) మీకు జనవరి 2029 లో మాత్రమే ఇస్తారు.


ఇంకో విషయం షేరు మార్కెట్లో వచ్చినట్టు కంపెనీలో మీకు ownership ఈ బాండ్ మార్కెట్లో రాదు.

బాండ్స్ లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలాగో తెలుసకుందాం.

ఉదా:- ఒక కంపనీ బాండ్ మార్కెట్ ద్వారా పదికోట్లను, షేర్ మార్కెట్ ద్వారా వంద కోట్లను క్యాపిటల్ తెచ్చుకొని వ్యాపారం చేసింది అనుకోండి ఎదైనా ఇబ్బందుల వల్ల ఆ కంపెనీకి లాస్ వచ్చి దివాలా తీసి చేతులు ఎత్తేసింది అనుకోండి. అప్పుడు RBI వాళ్ళు కలగచేసుకొని ఆ కంపనీ తాలూకు ఆస్తులు జప్తు చేసుకొని అమ్మగా వచ్చిన డబ్బులను INVESTERS కి ఇస్తుంది.

ఇపుడు ఆస్తులు అమ్మగా 50 కోట్లు మాత్రమే వచ్చింది అనుకోండి, ముందుగా బాండ్స్ కొన్న వారికి పది కోట్లు ఇచ్చి, మిగిలిన 40 కోట్లు షేర్స్ కొన్న వారికి ఇస్తుంది. 

అంటే పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం బాండ్స్ లో డబ్బులు పెట్టిన వారికి మొత్తం డబ్బులు వచ్చేస్తాయి... కానీ షేర్లలో డబ్బులు పెట్టిన వారికి మాత్రం 40 శాతం మాత్రమే వచ్చినట్టు. అందుకనే stock markets are subjected to market risk అంటారు. అయితే ఇలా కంపెనీలు దివాలా తీయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి.

బాండ్స్ లో short-term investments అంటే.... ఒక సంవత్సరం కన్నా తక్కువ maturity అయ్యే బాండ్స్ కూడా ఉంటాయి. 


కానీ ఇందులో తక్కువ returns  ఉంటాయి. మరియు చాలా complications ఉంటాయి.
బాండ్స్ చిన్న కంపెనీలు కూడా ఇష్యూ చేస్తాయి. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి.


అయితే ఎక్కువ జనాలు ఆసక్తి చూపేది మాత్రం corporate బాండ్స్ and గవర్నమెంట్ బాండ్స్... వీటి కూపన్ వాల్యూ (వడ్డీ) తక్కువ వచ్చినా... సరే రిస్క్ తక్కువగా ఉంటుంది.
కొన్ని గవర్నమెంట్ బాండ్స్ locking period ఎక్కువగా పెట్టుకుంటే సెక్షన్ 80C కింద tax exemption కూడా పొందవచ్చు.


బాండ్స్ లో Pros/cons 


ముందుగా........

PROS(అనుకూల అంశాలు):- 


LOW RISK:-  ఇందాక చెప్పినట్టు మంచి కంపెనీలో బాండ్స్ తీసుకుంటే మీ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది.


CLEAR UNDERSTANDING:-  ప్రతీ బాండ్స్ కి కూపన్ వాల్యూ మరియు maturity time ముందుగానే తెలుసు కాబట్టి మీ financial goal ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెష్ట్ చేయొచ్చు.


LIQUIDITY:-  మీరు డబ్బులు అవసరం వచ్చినపుడు మీ బాండ్స్ ను సెకండరీ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. అయితే అక్కడ బాండ్స్ కి తక్కువ buyer's ఉండటం వల్ల మీ బాండ్స్ అమ్ముడు పోవటానికి కొంత సమయం పట్టవచ్చు.


CONS(ప్రతికూల అంశాలు):-

LOW RETURN:-  మీకు సంవత్సరానికి 8 నుండి 10 శాతం వరకు మాత్రమే వడ్డీ రావొచ్చు.
దీనిని లో రిస్క్ & లో రిటర్న్ అనుకోవచ్చు.అయితే FD కంటే 2 నుండి 3 శాతం ఎక్కువే వస్తుంది.


2 శాతమేనా అని మనకు అనిపించినా..... ఒక కోటి రూపాయలు invest చేసినవారికి 2 శాతం అంటే రెండు లక్షలు. ఎంత కోటీశ్వరుడు అయినా 2 లక్షలు వదులుకోవడానికి సిద్ధపడరు.



చివరగా.... బాండ్స్ అనేవి ఎక్కువ డబ్బులు (అంటే కోట్లలో) ఉండి, తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకునే వారికి బాగుంటాయి. లక్షో లేదా రెండు లక్షలో ఉండే వాళ్ళు ఫైనాన్సియల్ మార్కెట్ పై నాలెడ్జ్ ను సంపాదించి మంచి రిటర్న్స్ వచ్చే పెట్టుబడి చేయడం మంచిది.


Mutual funds:- కొంత మంది ఇన్వెస్టర్స్ కలిసి,కొంత మందిని నమ్మి ఒక మంచి professional fund మేనేజర్ ను పెట్టుకొని ఒక కంపెనీని నడిపిస్తారు. దీనినే... అసెట్ మేనేజ్మెంట్ (mutual funds) కంపనీ అంటారు...

what is mutual fund telugu , mutual funds telugu


ఇపుడు ఈ ఇన్వెస్టర్స్ equity మార్కెట్లోనో....లేదా debt మార్కెట్లోనో.... కొన్ని schemes  ను design  చేసుకొని వాటిలో invest చేసి వచ్చిన డబ్బులను పంచుకుంటారు. Schemes  కి ప్రజలకి చూపించి ఆసక్తి ఉన్నవారు ఆ స్కీమ్స్ లో invest చెయ్యొచ్చు అని NFO(new fund offer) ద్వారా invite చేస్తారు.


స్కీమ్ లలో రకాలు/ TYPES OF SCHEMES :- 

>Equity Market scheme:-

వీటిలో ఫండ్ మేనేజర్ వివిధ రంగాల్లో కూడా ఇన్వెష్ట చేస్తారు. ఉదా:- ఫార్మా, ఆటో, ఐటీ, బ్యాంకింగ్. వీటిని గ్ అంటారు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది.

> Debt market scheme:-

రిస్క్ తక్కువ తీసుకోవాలి అనుకునే వారికి ఈ స్కీం ఉపయోగపడుతుంది, ఈ స్కీం బాండ్స్ మరియు ఇతర సాధనాలలో invest చేస్తారు.


>Balanced funds:-

వీటిలో కొంత డబ్బును eqity మార్కెట్లో మరియు కొంత డెంట్ మార్కెట్లో invest చేస్తారు.
ఉదా:- 40 శాతం equity 40 శాతం debt ,20 శాతం గోల్డ్ లో invest చేస్తారు.

వీటిలో SIP లేదా lump-sum ఈ రెండు దారుల్లో మనం invest చేయొచ్చు.... చాలా మంది SIP mode ద్వారానే చేస్తుంటారు. 


LUMP-SUM:- అంటే మనం invest  చెయ్యాలి అనుకున్న అమౌంట్ మొత్తం ఒకేసారి invest
 చేయడాన్ని lump-sum అంటారు.


SIP:- systematic investment plan అంటే... మీరు ఎంచుకున్న scheme లో పదిరోజులకు ఒకసారి, నెలకు లేదా రెండు నెలలకు.... ఇలా మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన అమౌంట్ ( తక్కువలో తక్కువ వంద రూపాయలు) ఆ ఫండ్ లో జమ అవుతుంది.
మీరు SIP ద్వారా ఎంత సంపాదించవచ్చు అని తెలుసుకునే calculators చాలా ఉన్నాయి లింక్... 


అయితే ఇది మీ మొబైల్ లో చేసుకునే వీలు కూడా ఉంది.


మీకు కావాల్సిందల్లా.... 

1. బ్యాంక్ ఖాతా (మొబైల్ నంబర్ లింక్ ఉన్నది)
2.PAN 
3. ఆధార్ కార్డు (మొబైల్ నంబర్ లింక్ ఉన్నది)
మీరు అకౌంట్ ఓపెన్ చేశాక వాళ్ళు వెరిఫై చేసి ఐదు రోజుల్లో మీ account Verify  చేస్తారు.
అయితే చాలా మంది SIP mode ద్వారానే invest
 చేస్తారు. నేను కూడా  అలానే చేయమని చెప్తాను.
ఒక్క విషయం ఫండ్స్ నీ సెలెక్ట చేసుకునే అప్పుడు మనం direct funds మరియు growth లను మాత్రమే ఎంచుకోవాలి. Regular funds and dividend అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కొంత ఎక్కువ చార్జెస్ పడతాయి కాబట్టి దాని జోలికి పొకపోవడమే మంచిది.
 Dividend అంటే మనం invest  చేసిన అమౌంట్ కి వచ్చే రిటర్న్ మన బ్యాంకులో కి ప్రతి నెల వస్తుంది.. దీని కంటే growth అంటే.... మనకి వచ్చిన లాభాలు మళ్లీ ఆ ఫండ్ లోనే invest చేస్తారు. ఇలా చేస్తే మనకి వచ్చిన లాభాలు అసలు లో కలవడం వల్ల వచ్చే returns పెరుగుతాయి. అదే కదా మనక కావాల్సింది.
Pros మరియు cons:-


PROS(అనుకూల అంశాలు):- 


RISK diversified:-  మీరు funds లో invest చేసిన డబ్బులు ఒకే కంపెనీలో invest  చెయ్యకుండా, కొంత శాతం equity మార్కెట్ లో కొంత శాతం debt మార్కెట్లో కొంత గోల్డ్ లో invest చేసేలా స్కీమ్స్ ఉంటాయి. అలా చేయటం వల్ల మనం వివిధ sectors లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఒక సెక్టార్ లో వచ్చే లాస్ నీ ఇంకో సెక్టార్ లో వచ్చే ప్రాఫిట్ కవర్ చేస్తుంది. దీనినే risk diverfication అంటాం. 


Professional fund manager(PFM):- 
ఇందాకా చెప్పినట్టు మంచి PFM మీ డబ్బులను mentain చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా అధ్యయనం చేసి invest చేస్తారు కాబట్టి బెంగ పడాల్సిన అవసరం లేదు.


SEBI:- 


మన దేశంలో అత్యంత కఠిన నిబంధనలు కలిగిన SEBI వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది.
Tax savings :-  మీకు ఇన్వెష్టమెంట్ లో ఒక ఫైనాన్సియల్ సంవత్సరంలో వచ్చిన లాభాల్లో పది శాతం calital gain tax కట్టాల్సి ఉంటుంది. అయితే mutual funds లో సంవత్సరం కన్నా ఎక్కువ పెట్టుబడి చేసి, వాటిలో వచ్చిన లాభాల్లో ఒక లక్ష వరకు calital gain tax  ఉండదు.


CONS(ప్రతికూల అంశాలు):-


Funds లో invest చేయడం అంటే స్టాక్ మార్కెట్ లో invest చేసినట్టే.....కాబట్టి రిస్క్ కూడా ఉంటుంది. 
 
ఈ ఆర్టికల్ కి ఇంతే........

దీని తెరువాతి ఆర్టికల్ అయిన  Basics of stock market telugu బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్  u2dt ను కూడా చదవండి.



    ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.


                                                          *********ధన్యవాదాలు*********