Types of investments | పెట్టుబడి సాధనాలలో రకాలు| u2dt.in Types of investments, investments types, stock market telugu

మన దేశంలో పెట్టుబడి సాధనాలు పరిమితంగానే ఉన్నాయి  అని చెప్పుకోవాలి.

Financial products  లో అతిపెద్ద ఆవిష్కరణ crypto currency (bitcoin) అని చెప్పుకోవచ్చు.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే... అది ఎక్కడ పుట్టింది, దాన్ని ఎలా కనుక్కున్నారు.. అనేది దాని పెట్టుబడి దారులయిన చాలా మందికి తెలీదు. ఇది చాలా మంది పెట్టుబడి దారులను ఆకట్టుకుంది. మరియు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. కానీ ఇది ఎంత వేగంగా ఎదిగిందో... అంతే వేగంగా పడిపోయింది. దీనికి ముఖ్యకారణం ఫండమెంటల్స్ సరిగ్గా లేకపోవడం. ఎదైనా financial products లో పెట్టుబడి చేసే ముందు fundamentals సరిగ్గా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి. మనకి ఆ product మీద మంచి అవగాహన రావాలి. మంచి అవకాశం కోసం ఎదురుచూసి అప్పుడు అందులో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది.



Fundamentals, fundamental analysis, analysis,stock market, technical analysis


 



Product fancy గా ఉండడం చూసి అందులో పెట్టుబడిచేసి తరువాత బాధపడతారు చాలామంది. మన కారో... లేదా వాడే మొబైలో.. ఫ్యాన్సీగా ఉండాలి అని చూడాలి కానీ... ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం మంచి fundamentals ఉన్న products లను మాత్రమే ఎంచుకోవాలి.


Types of investments in telugu  దేశంలో సాధారణంగా వాడే పెట్టుబడి సాధనాలు:- 

Fixed deposit, types of investments, fixed deposit account, bank account

1. ఫిక్స్డ్ డిపాజిట్(fixed deposit):- 

మీరు మీ బ్యాంకులో మీ డబ్బుని కొంత పరిమితి సమయానికి(maturity time) FD గా పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. మీరు FD చేసిన డబ్బు విలువ మరియు పరిమితి సమయాన్ని బట్టి వచ్చే వడ్డీ రేటు ఆధారపడి వుంటుంది.మన దేశంలో సగటుగా 6% నుండి 8% వడ్డీగా వస్తుంది.


Fixed Deposit లో pros/cons చూద్దాం..!


అనుకూల అంశాలు (pros):-


 Low risk :- ముందుగానే నిర్ణయించుకున్న ఇంట్రెస్ట్ రేటుతో మీ డబ్బులు mature అవ్వగానే బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి.. ఇందులో రిస్క్ తక్కువగానే ఉంటుంది.


Liquidity :- మీకు డబ్బు బాగా అవసరం ఉన్నప్పుడు మీ డబ్బులను ఎంత త్వరగా మార్చుకోగలరో దానినే liquidity అనవచ్చు.


Fixid deposit విషయానికి వస్తె.. మీకు డబ్బులు అవసరం అనుకున్నపుడు మీ FD ని కేన్సిల్ చేసుకొని ఆ డబ్బులను వెంటనే పొందవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీకు రావాల్సిన వడ్డీ కొంచెం తగ్గవచ్చు. ఎక్కువగా ఈ ప్రొడక్ట్ రిటైర్మెంట్ అయినవాళ్ళు..లేదా రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నవాళ్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత అగ్రెసివ్ మైండ్ సెట్ తో పెట్టుబడి పెట్టలేరు కాబట్టి.


ప్రతికూల అంశాలు (cons):-


• Low return :-
ముందుగా చెప్పినట్టు FD లో 6% నుండి 8% మాత్రమే వడ్డీ వస్తుంది. ఒక వైపు ద్రవ్యోల్బణ రేటు(inflation rate) 5% శాతం ఉండటం వల్ల FD ఇచ్చే వడ్డీతో మనం లబ్దిపొందేది పెద్దగా లేదనే చెప్పుకోవాలి.


ఇంకో విషయం 2011 లో inflation rate 10% గా ఉంది. అంటే.. ఆ సంవత్సరంలో FD లో డబ్బులు ఉంచుకున్నవారు 4% నష్టపోయారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ డబ్బుని FD 6% పెంచుతుంటే...inflation మాత్రం 10% తగ్గించింది. అంటే మీ ఆర్థిక స్థానం సమయంతో పెరగలేదు అన్నమాట...
ఫైనల్ గా దీనిని లో రిస్క్ & లో రిటర్న్ గా చెప్పుకోవచ్చు..
అయితే...ఇంట్లోనో లేదా సేవింగ్స్ అకౌంట్లోనో డబ్బులు దాచుకోవడానికి బదులు FD చేసుకోవడం మంచిదే....

2. సేవింగ్స్ అకౌంట్(savings account):- ఇది సాధారణంగా అందరూ వాడే బ్యాంక్ ఖాతా. ఇది ప్రతి మనిషి డబ్బులను దాచటానికి మరియు లావాదేవీలు జరపటానికి ఉపయోగిస్తారు. మీరు మీ ఖాతాలో ఉంచిన డబ్బుకి 4% నుండి 6% వరకు  బ్యాంక్ వారు ఇస్తారు.


దీని తరువాతి ఆర్టికల్ అయిన పెట్టుబడి సాదనాలలో రకాలను వివరిస్తూ ఇంకొక ఆర్టికల్ రాశాము, ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి చదవండి 

ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.


                                     *********ధన్యవాదాలు*********