investment in telugu ?| why to invest in Equity |అసలు పెట్టుబడి ఎందుకు చెయ్యాలి?

Why to investment in stock market,why to invest, how to invest

1. To secure our financial position మన ఆర్థికస్థితిని భద్రపరచుకోవడానికి.

మీరు ఏ వృత్తిలో  ఉన్నామరియు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా...ఎంతో కొంత డబ్బు పెట్టుబడులలో పెట్టకపోతే మీరు తప్పుచెస్తున్నట్టే.

అది ఎందుకో ఈ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!

ఉదాహరణ 1:- రాము దగ్గర పది సంవత్సరాల కింద ఒక లక్ష రూపాయలు ఉన్నాయి.  వాటిని రాము తన తాత ముత్తాతలు చేసినట్టు ఇనుపపెట్టేలో దాచిపెట్టి రోజు చూస్తూ మురిసిపోయాడు. 

రాము అలా చేయడం వల్ల పది సంత్సరాల కింద ఉన్న లక్ష రూపాయలు ఎంత ఇపుడు అయివుండవచ్చు?

> ఐదు లక్షలు- కావు

> నాలుగు లక్షలు - కావు 

> పోనీ... రెండు లక్షలు - ఏమాత్రం కావు.

తను పెట్టిన లక్ష మాత్రమే ఉంటాయి. పెరగలేకపోయినా తను లాస్ అవ్వలేడు కదా! అనుకుంటాం. కానీ.....

ఉదాహరణ 2:- లక్ష్మణ్ తన దగ్గర ఉన్న లక్షను మంచి ఆదాయం వచ్చే పెట్టుబడులలో పెట్టాడు.

లక్ష్మణ్ మంచి ఆదాయం వచ్చే పెట్టిటుబడులలో పెట్టుబడి పెట్టడం వల్ల సంత్సరానికి తక్కువలో తక్కువ 10% ఆదాయం వచ్చింది అనుకున్నా... అవి పది సంత్సరాలకి 2.7 లక్షలు అవుతాయి..  ఇక్కడ లక్ష్మణ్ తో పోల్చి చూస్తే రాము దాదాపుగా 1.7 లక్షలు లాస్ అయ్యాడు. ఈ చిన్న ఉదాహరణతో చెప్పుకోవచ్చు పెట్టుబడికి ఉన్న ప్రముక్యత. investment in telugu

2.  To beat the inflation (ద్రవ్యోల్బణం వల్ల వచ్చే నష్టాలను అదికమించడానికి).

Inflation, inflation rate India ,what is inflation

మనం పైన చదివినట్టు కొన్ని సంత్సరాల కింద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు ఉండదు అని తెలుసుకున్నాం. దీనికి కారణం ద్రవ్యోల్బణం (inflation). ద్రవ్యోల్బణ రేఖ అంటే నిత్యావసరాల ధరలు ఒక సంవ్సరానికి ఎంత శాతం పెరుగుతుంది అని తెలిపే సూచిక.

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన ద్రవ్యోల్బణ రేటు యావరేజ్ 5% గా పరిగణిస్తారు.

ఉదా:- 2020 జనవరిలో మీ నిత్యవసలకు 1000/-రూపాయలు అయితే 2021 జనవరిలో 1050/- అవుతుంది. (ఎక్కువ కుడా అవ్వొచ్చు) దీనికి కారణం ద్రవ్యోల్బణం!

>> అందుకే మనం పొదుపు చేసుకునే డబ్బులను కనీసం ద్రవ్యోల్బణ రేటు కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేట్లు మంచి ప్రణాళికతో పెట్టుబడి పెట్టాలి.

ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు సంవత్సరానికి 5% గా ఉంది. అంటే కనీసం సంవత్సరానికి 12% శాతం ఆదాయం వచ్చే పెట్టుబడులలో పెట్టుబడి చేయటం మంచిది.

3.To achieve the financial goals(ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి.)

ప్రతి మనిషికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వారికోసమే మనిషి కళలు కంటూ , కష్టపడి డబ్బులు సంపాదిస్తూఉంటాడు.

అందరికీ ఉండే సహజ ఆర్థిక లక్ష్యాలు:-

  •  సొంత ఇంటి కల.
  •  సొంత వాహనం కొనుక్కోవడం.
  •  పిల్లల చదువు మరియు వాళ్ళ పెళ్లి కోసం.   
  •  రిటైర్మెంట్ తర్వాత చింత లేని జీవితం కోసం.


>> అయితే...వీటన్నింటినీ సాధించడానికి కేవలం డబ్బుని పొదుపు చేసుకుంటే సరిపోదు. ఆ డబ్బులను మంచి ఆదాయం వచ్చే పెట్టుబడులలో పెట్టుబడులు చేసి, ఆ డబ్బే ఇంకా డబ్బులను సంపాదించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

investment in telugu

ప్రపంచ కుబేరులుగా పిలవబడే చాలా మంది తాము చేసిన ఉద్యోగం వల్ల ఆ స్తాయికి చేరలేదు. అలా ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బులు మరియు ఇతర రూపంలో వచ్చిన డబ్బులను వాళ్ళకు తెలిసిన వ్యాపారాలలో పెట్టుబడి చేసి వచ్చిన రిటర్న్స్ ని కూడా పెట్టుబడి చేస్తూ వాళ్ళ డబ్బులను కంపొండెడ్ (CAGR) ఎఫెక్ట్ తో కొన్ని వందల, వేల రెట్ల లాభాలను గడించి ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నారు. మనం కూడా అలా అవ్వాలి అంటే పెట్టుబడి చేయటం అనేది ఒక ఉత్తమమైన మార్గం. 

Conclution:-

ఈ ఆర్టికల్ లో రూపాయి విలువ రోజురోజుకి తగ్గిపోతుంది అని తెలుసుకున్నాo. అలాగే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మన రూపాయే ఇంకో రూపాయి ని సంపాదించేట్లు చేయగలం అని తెలుసుకున్నాం. అలా జరగాలి అంటే మనం దాచుకున్న డబ్బు మంచి పెట్టుబడి లలో పెట్టాలి అని తెలుసుకున్నాం. 

What is the stock market in Telugu | స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి?



ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.
                                     ************ధన్యవాదాలు************