Basics of stock market telugu| బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ | u2dt


స్టాక్ మార్కెట్లు అనేవి ఒక జూదం అని...సామాన్య ప్రజలకు అది మంచిది కాదు అని.. చాలామంది అభిప్రాయం. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్దమో చూద్దాం.


basics of stock market telugu


ముందుగా షేర్ మార్కెట్ అంటే ఏమిటి? షేర్ అంటే ఏమిటి? షేర్ వాల్యూ అంటే ఏమిటో చూద్దాం.

టాటా మోటార్స్ నానో లాంటి ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది అనుకుందాం.ఆ ప్రాజెక్ట్ కి వెయ్యి కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అనుకుందాం.


ఇప్పుడు ఆ డబ్బులు టాటా మోటార్స్ ఎక్కడ నుండి వస్తాయి. అందులో ఏ ఒక్క డైరెక్టరో... లేదా అందరు డైరెక్టర్లను కలుపుకున్నా...వారి దగ్గర అంత లిక్విడ్ రూపంలో డబ్బు ఉండదు. ఒకవేళ కంపెనీ దగ్గర ఉన్న అన్ని డబ్బులు ఒక ప్రాజెక్ట్ కి వాడెయ్యటానికి షేర్ హోల్డర్స్ ఒప్పుకోకపోవచ్చు.


ఒకవేళ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నా.... ప్రాజెక్ట్ కాకముందే, లేదా లాభాలు రాకముందే వడ్డీలు కట్టండి అంటూ బ్యాంకువారు ఒత్తిడి చేస్తూ ఉంటారు.


కాబట్టి ఇది కూడా కష్టమే..


ఇక్కడే స్టాక్ మార్కెట్లు వస్తాయి. వీటినే షేర్ మార్కెట్లు అని కూడా అనవచ్చు. టాటా మోటార్స్ తమ ప్రాజెక్టు వివరాలు,బడ్జెట్ ప్లాన్, రిటన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ROI) ఇలా అన్ని వివరాలని చెప్పి కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఆ కంపెనీ మీద లేదా ఆ ప్రాజెక్టు మీద నమ్మకం ఉన్నవాళ్లు తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ కంపెనీల షేర్లు తెచ్చుకుంటారు.


కంపెనీ...ఇప్పుడు ఆ వెయ్యి కోట్ల రూపాయలను 10 కోట్ల భాగాలుగా(units) భాగిస్తుంది అనుకోండి... 

 

ఆ భాగాలను(units)నే షేర్ అంటాం. ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలను పది కోట్ల భాగాలుగా చేస్తే..(units) వచ్చే విలువ(value)ని షేర్ వాల్యూ అని అంటారు. 


పైన ఉదాహరణలో షేర్ ప్రైస్ ₹100 అన్నమాట. ఇప్పుడు షేర్ ప్రైస్ వంద రూపాయలే కాబట్టి ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి చేస్తే వారికి వెయ్యి షేర్లు వస్తాయి. అంటే మొత్తం ఉన్న 10 కోట్ల షేర్ల లో వారి దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఆ కంపెనీలో 0.001శాతం వాటా ఉన్నట్లు.


ఇప్పుడు ఆ కంపెనీ తెచ్చుకున్న ఆ లాభాలను కొన్నిసార్లు డివిడెండ్లు గాను కొన్ని సార్లు బోనస్ షేర్ల రూపంలోనూ ఇన్వెస్టర్లకు ఇస్తుంది.


మీరు ఇలా ఒక కంపెనీ షేర్లు కొనాలి అంటే మీకు ఒక demat account ఉంటే సరిపోద్ది. కానీ... ఆ షేర్లను సెకండరీ మార్కెట్ లోకి వెళ్లి అమ్మాలి అంటే మాత్రం మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి.


demat account telugu




 


demat account అంటే dematerialised account, అంటే ఫిజికల్గా మీ దగ్గర పేపర్ రూపంలో ఉండాల్సిన షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో మీ అకౌంట్లో ఉంచడం.


షేర్ మార్కెట్ల వల్ల షేర్ హోల్డర్స్ కు తమ పెట్టుబడి మరే ఇతర ప్రోడక్టులలోను రానంత లాభం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే నష్టం వచ్చే పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. ఒకవేళ కంపెనీ నష్టాల్లో ఉంటే investors పెట్టుబడి కూడా నష్టపోయినట్టే. 

risk reward ratio, stock market telugu


అందుకే "stock markets are very risky" అంటారు. risk లేనిదే return కూడా ఉండవు. కాకపోతే risk క్యాలిక్యులేటెడ్ అయి ఉండాలి. random risk కాకూడదు.


మనం మంచి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీలు అంటే... TATA,RELIANCE, INFOSYS...etc ఇలాంటి కంపెనీలలో పెట్టుబడులు పెడితే పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయి అని చెప్పుకోవాలి.






-------------------------------------------------------------------------------------------------------------------

ఈ ఆర్టికల్ లో ఉన్న కంటెంట్ ఉపయోగడుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.


                                                *********ధన్యవాదాలు*********