Ipo meaning in telugu,what is initial public offering , u2dt

Ipo meaning in Telugu | what is an initial public offering  


Ipo meaning in Telugu:-


IPO అంటే Initial public offer... ఏదైనా కంపెనీ తమకు ఉన్న అప్పులు తీర్చడానికి లేదా కంపెనీ expansion కోసం డబ్బులు కావాల్సి వస్తే, ఆ కంపెనీ యొక్క షేర్ లను  పబ్లికు అమ్మే ప్రయత్నంలో భాగంగా మొదటి సారి స్టాక్ మార్కెట్లు లిస్ట్ అవడానికి ప్రయత్నిస్తుంటాయి దీనినే IPO అంటారు.

అయితే ఇలా IPO గా రావాలి అంటే ముందుగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముందుగా సదరు కంపెనీ DRHP(draft red herring prospectus)ని SEBI కి  సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిని sebi వెరిఫై చేసి ఆమోదం తెలిపిన తర్వాత కంపెనీ ఏ ధరలో రావాలి అనుకుంటున్న విషయాలు మరియు ఎప్పుడు లిస్ట్ అవ్వాలి, కటాఫ్ ప్రైస్ ఎంత ఇలాంటి విషయాలను తెలియజేస్తుంది.


IPO అప్లై చేసే ముందు కొన్ని పదాలను తెలుసుకోవాలి.


CUTOFF PRICE:-

cutoff అంటే ఆ కంపెనీ షేర్లు మనకు ఆఫర్ చేసే maximum ధర.

ఉదాహరణకు ఒక కంపెనీ షేర్ 500 నుంచి 520 మధ్యలో పబ్లిక్ కు ఆఫర్ చేయాలి అనుకుంటుంది. ఇక్కడ maximum ప్రైస్ 520 రూపాయలు.ఈ 520 రూపాయలే cutoff price అవుతుంది.


OVER SUBCSRIBE:-

అంటే కంపెనీ ఆశించిన షేర్ల కంటే ఎక్కువ మంది పేర్లను ఆర్డర్ ఇవ్వడం. ఉదాహరణకు ఒక కంపెనీ 100 కోట్లకు IPO గా వచ్చింది, కానీ ఆ కంపనీ యొక్క ఫండమెంటల్స్ బాగుండటం వల్ల IPO అప్లికేషన్స్ వారు కోరినదాని కంటే ఎక్కువగా వచ్చాయి. ఇలా కంపనీ వాళ్ళు కోరుకున్నదాని కంటే ఎక్కువ అప్ప్లికషన్స్ రావటాన్ని over subscribe అవ్వటం అంటారు.


UNDER SUBCSRIBE:-

అంటే కంపెనీ యొక్క ఫడమెంటల్స్ బాగలేక లేదా ఇతర ఏ కారణాల వల్లనో కంపనీ ఆశించిన వాటి కంటే తక్కువ మంది ఆ షేర్లను గురించి ఆసక్తి చూపించడం. దీనినే under subcsribe అవ్వటం అంటారు.


GMP:- 

అంటే gray market premium. దీనిని గురించి కొంచెం వివరంగా ఒక ఆర్టికల్ లో తెలుసుకుందం.


LOT SIZE:-

ఒక ipo వస్తే ఆ కంపనీలో మనం ఒక షెరో లేదా రెండు షేర్లు అప్లై చేయటానికి వీలు ఉండధు. కంపనీ ఇన్ని షేర్లు అయితేనే అప్లై చేయొచ్చు అని చెపుతుంది. ఉదాహరణకు 20 లేదా 90 ... etc. ఇలా ఒక 20 షేర్లను కలిపితే ఒక LOT అంటారు.  ఒక లాట్ లో ఎన్ని షేర్లు ఉండాలి అని కంపనీ నిర్ణయిస్తుంది.

ok......


Ipo meaning in telugu 

అయితే ఈ IPO లు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చదివి వాళ్లు ఏ బిజినెస్ లో ఉన్నారు మరియు ముక్యంగా ఆ డబ్బులుని ఏ విధంగా ఉపయోగించాలి అనుకుంటున్నారు అనే అంశాలపై స్టడీ చేయాలి ఆ తర్వాత ఆ కంపెనీ IPO లో పెట్టుబడి చేయాలా వద్దా అనే డిసిషన్ తీసుకోవాలి.


మరియు IPO వచ్చే సమయంలో మార్కెట్ కండిషన్ కూడా ఎలా ఉందో గమనించాలి. ఒకవేళ ఆ సమయంలో మార్కెట్ క్రాష్ లో ఉంటే IPO ని అప్లై చేయకపోవడమే మంచిది ఎందుకంటే అలాంటి సమయంలో కంపెనీ కూడా డిస్కౌంట్ లో వచ్చే అవకాశం ఉంది.


ఉదాహరణకు recent గా కార్ ట్రేడ్ అనే కంపెనీ IPO గా వచ్చింది. ఆ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయ్యే సమయానికి. మన నిఫ్టీ మరియు గ్లోబల్ గా అన్నీ మార్కెట్లు రెడ్ లో ఉండడంవల్ల ఈ కంపెనీ డిస్కౌంట్ లో లిస్ట్ అయ్యింది


IPO అప్లై చేసిన అందరికీ ఇస్తారా?


కొన్ని under subscribe అయితే apply చేసిన వారందరికి ఇస్తారు. కానీ ఉదాహరణకు ఒక కంపెనీ 100 కోట్లు IPO గా వచ్చింది కానీ ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగుండటం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు పోటీపడి మరీ అప్లై చేశారు. అందువల్ల అప్లై చేసిన వారందరికీ ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు లాటరీ పద్ధతిని ఎంచుకుంటారు.


Shanarti Telangana epaper చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.