Financial markets types | DIfferent types of financial markets | stockmarket Telugu
1.MONEY MARKET:-
దీనిని DEBT MARKET అని కూడా అంటుంటారు. అంటే కంపెనీస్ ఇన్వెస్టెర్స్ దగ్గరనుండి డబ్బులు అప్పుగా తెచ్చుకొని ఆ డబ్బులకు వడ్డీలు కట్టుకుంటూ ఉంటుంది.
2.CAPITAL MARKETS:-
దీనిని షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ అని కూడా అంటూ ఉంటారు. ఇన్వెస్టర్ల దగ్గర నుండి తీసుకున్నడబ్బులకు సరిపడ ఆ కంపెనీలో వాటా ఇస్తుంది.
క్యాపిటల్ మార్కెట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి:-
వీటిని అర్థం చేసుకునేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.
మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ వున్నాడు అనుకోండి అతనికి ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది మరియు మంచి ప్లాను కూడా ఉంది. కానీ సరిపడ డబ్బులేక ఆ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నాడు. అయతే అదే సమయంలో మీ దగ్గర ఉన్న డబ్బులని మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బులను గ్రో చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు తెలిసిన అతను కాబట్టి మీకు తన మీద చాలా నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో మీ ఫ్రెండ్ కి ఆ డబ్బులను ఆ బుస్సీనెస్స్ స్టార్ట్ చేయటానికి ఇచ్చారు.
ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రెండు విధాలుగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది:-
1). ఒకటి, మీరు ఇచ్చిన డబ్బులకు సంవత్సరానికి 12% చొప్పున వడ్డీ అని చెప్పి ఉదాహరణకు రెండు సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేయాలని అగ్రీమెంట్ రాసుకున్నారు. అంటే 2 సంవత్సరాల తర్వాత అసలుతో పాటు ఆ వడ్డీ డబ్బులు వస్తాయు.
2). మీ వల్లనే బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి తన బిజినెస్ లో వాటా అడుగుతారు ఉదాహరణకు ఒక యాభై శాతం వాటా అనుకోండి, అంటే ఆ బిజినెస్ లోకి వచ్చే లాభాలలో 50% అలాగే ఎవరైనా ఒక కోటి రూపాయలు ఆ కంపెనీ కొందాం అనుకుంటే ఆ కోటిలో సగం అంటే 50 లక్షలు వస్తాయి. అలాగే ఒకవేళ నష్టము వచ్చిన మీకు 50% వాటా ఉంటుంది.
అయితే పైన చెప్పిన ఉదాహరణలు ఆప్షన్ 1 ను పాటించేది మనీ మార్కెట్, మరియు ఆప్షన్ 2ను పాటించేది క్యాపిటల్ మార్కెట్.
మనీ మార్కెట్ / డెట్ మార్కెట్:-
ఈ మార్కెట్లో ఎక్కువగా బాండ్స్ అమ్ముడు పోతుంటాయి. దీనిని RBI రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మరియు కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ కి ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ బాండ్స్ mature period అనేది ఒక సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.
క్యాపిటల్ మార్కెట్ / ఈక్విటీ మార్కెట్:-
ఇది కూడా లాంగ్ టర్మ్ కి ఉపయోగ పడుతుంది. కంపెనీ వాల్లు ఇన్వెస్టర్స్ దగ్గరనుండి డబ్బులు తీసుకుని ఆ డబ్బులకు సరిపడా వాటాను వాళ్ళ కంపెనీలో ఇస్తారు దీనిని SEBI రెగ్యులేట్ చేస్తుంది.
ఎలాంటి సందర్భాల్లో ఈ కంపెనీలు మనీ మార్కెట్ ను మరియు ఈక్విటీ మార్కెట్ లోకి వస్తాయో చూద్దాం:-
ఉదాహరణకు మీరు ఒక కంపెనీని ఒక కోటి రూపాయల తో స్టార్ట్ చేశారు,ఆ కంపనికి ఏటా పది లక్షల లాభాలు వస్తున్నాయి. ఈ కంపెనీ బ్రాంచ్ లను వేరే రాష్ట్రాల్లో కూడా మొదలు చేయాలి అని మీరు అనుకుంటున్నారు దానికి రెండు కోట్లు కావాల్సి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరు మనీ మార్కెట్ లో ఆ డబ్బులను తెసుకుంటే సంవతరానికి 10% చొప్పున అంటే 20 లక్షల వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మీకు వస్తున్న లాభాల కంటే ఎక్కువ కట్టాలి కాబట్టి ఈక్విటీ మార్కెట్ లోకి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ అయితే వడ్డీ కట్టడం ఉండదు కాబట్టి. కంపనీలో వాటా ఇస్తే సరిపోతుంది.
ఇంకో ఉదాహరణ లో మీరు 100 కోట్లతో కంపెనీ స్టార్ట్ చేశారు అది కూడా బాగానే నడుస్తుంది. ఆ కంపనిలో ఒక పరికరాన్నిమార్చడం కోసం అయిదు కోట్లు అవసరం వచ్చింది. వంద కోట్లతో పోల్చితే అయిదు కొట్లే అనేవి చిన్న అమౌంట్ కాబట్టి ఈ చిన్న అమౌంట్ కోసం వేరే వాళ్ళకు వాటా ఇవ్వాలా అని సందేహంతో ఈక్విటీ మార్కెట్ లోకి వెళ్లకుండా డెట్ మార్కెట్ లోకి వెలతారు. అయిదు కోట్లకు అయ్యే వడ్డిని సులభంగా తీర్చగలరు ఎందుకంటే మీ వందకోట్ల కంపనీ కాబట్టి.
primary market లో కంపెనీకి మరియు ఇన్వెస్టర్లకు డైరెక్టుగా సంబంధం ఉంటుంది అదే secondary market లో అయితే కంపనికి సంబందం లేకుండా ఇన్వెస్టర్ కి ఇన్వెస్టర్ కి మధ్యన ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది.
ఒక కంపెనీ కొత్తగా డబ్బుల కోసం పబ్లిక్ లోకి వస్తే దానిని IPO అంటారు.దీనిలో మనం primary market లో కంపనీ దగ్గరినుండి డైరెక్ట్ గా ఆ కంపనీ షేర్లను తీసుకోవచ్చు.
మీకు షేర్స్ ఇచ్చిన తర్వాత NSE&BSE exchages లలో ఆ కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రైమరీ మార్కెట్ లో మీరు కొనుకున్న షేర్లను సెకొందరి మార్కెట్లో మీ తోటి ఇన్వెస్టర్స్ కి అమ్ముకోవచ్చు. దీనివల్ల లిక్విడిటీ పెరుగుతుంది. అంటే, మీకు కావలసినప్పుడు లేదా మంచి ధర వచ్చినప్పుడు ఆ పేర్లను secondary మార్కెట్లో అమ్ముకునే వీలు ఉంటుంది.
0 Comments