Dividend meaning in Telugu |  డివిడెండ్ అంటే ఏమిటి?  stock market Telugu 

మనం తరచు వింటుంటాం ఫలానా కంపెనీ ఇంత డివిడెండ్ ప్రకటించింది అని మరియు మనం ఒక  కంపనీ ఫండమెంటల్స్ చూసేటప్పుడు కూడా ఈ కంపెనీ డివిడెండ్ ఎంత ఇస్తుంది అని పరిశీలిస్తుంటాం.

ఈ ఆర్టికల్లో డివిడెండ్ మరియు డివిడెండ్ కి ఉన్న ప్రముక్యత గురించి మనం తెలుసుకుందాం.

ముందుగా డివిడెండ్ గురించి:-

Dividend meaning in telugu

ఏదైనా కంపెనీ తమకు వచ్చిన లాభాల్లో కొంత శాతం డబ్బులను తమ షేర్ హోల్డర్లు ఇస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చిన లాభాల్లో మొత్తం కాదు కొంచెం మాత్రమే ఇస్తుంది. అది ఆ కంపెనీ లో ఎంత మంది ఉంటే అంత మంది ఉంటే అంతమందికి ఇస్తారు. ఇంకా వివరంగా ఎన్నిషేర్లు ఉంటే అన్ని షేర్లకు ఇస్తారు. దానినే మనం డివిడెండ్ అంటాం. మరియు మిగతా డబ్బులను ఆ కంపెనీ అభివృద్ధికి లేదా అలా రిజర్వు గా ఉంచుతారు.

అయితే అన్ని కంపెనీలు ఈ డివిడెండ్ ని ఇస్తాయా అంటే? లేదు చాలా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ డివిడెండ్ ఇస్తుంటాయి. అన్నీ కంపనీలు ఈ డివిడెండ్ ఇవ్వాలి అనె రూల్ ఏమి లేదు.

అయితే ఒక కంపెనీ లాభంలో ఉంటేనే ఇస్తుందా? నష్టాల్లో ఉంటే డివిడెండ్ ఇవ్వదా... అనే సందేహం సహజం.

కొన్ని కంపెనీలు నష్టాల్లో ఉన్న కూడా డివిడెండ్ ఇస్తుంటాయి. అది ఎలా అంటే, ఉదాహరణకు ఒక కంపెనీ 2019 వ సంవత్సరంలో బాగా లాబాలను మరియు 2020 వ సంవత్సరంలో కూడా బాగా లాబాలను సంపాదించింది. కానీ 2021 వచ్చే సమయానికి ఆ కంపెనీ నష్టాన్ని నష్టాన్ని చవి చూసింది అనుకోండి, కానీ 2021 లో కూడా డివిడెండ్ ని ఇచ్చింది. ఎలా అంటే? ఆ కంపనీ కి 2019,2020 లో వచ్చిన లాబాల్లో అన్నిడబ్బులను కర్చు చేయకుండా అలా ఒక మూలాన పెట్టుకుంది అంటే స్టాక్ మార్కెట్ బాష లో CASH ని RESERVE లో ఉంచింది. ఇపుడు అంటే  2021లో ఆ CASH RESERVE లో నుండి డివిడెండ్ ఇచ్చింది. కొన్ని సార్లు ఇలా కూడా చేస్తుంటాయి కంపనీలు.

ఈ డివిడెండ్ కాన్సెప్ట్ ని సులబంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఒక ఇల్లుని ఎవరికైనా అద్దెకి ఇస్తే నెల నెలా అద్దె డబ్బు వస్తుంది కదా. దానిని కూడా డివిడెండ్ అనుకోవచ్చు, ఇకడ ఇల్లు నిర్మాణానికి అయిన ఖర్చు మన పెట్టుబడి అవుతుంది. Dividend meaning in telugu

మరి ఇలా ఎందుకు అంటే?

మామూలుగా ఇలా డివిడెండ్స్ ఇచ్చే కంపనీల వైపు పెట్టుబడి దారులు చాలా ఆసక్తిని చూపిస్తుంటారు. అలా ఆసక్తి చూపించడం వల్ల ఆ కంపనీ షేర్ ధర పెరిగే అవకాశం వుంటుంది. ఇలా జరిగితే ఆ కంపనీ వాల్యుయేషన్ పెరుగుతుంది అని డివిడెండ్ ఇస్తుంటాయి కంపనీలు.

ఈ డివిడెండ్లు ప్రతి సంవత్సరం లేదా ఆరు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటాయి.

కంపెనీ తమ రిజల్ట్స్ ని ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తూ ఉంటుంది కదా వాడితోపాటే బోర్డు మీటింగులో ఈ డివిడెండ్ ని కూడా ప్రకటిస్తుంటారు.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం:-

ప్రతి నెలా మూడు నెలలకోసారి లేదా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డివిడెండ్ ఇచ్చే కంపెనీ మంచిదా లేదా అస్సలే డివిడెండ్లు ఇవ్వని కంపెనీ మంచిది కాదా అనే సందేహం రావచ్చు. Dividend meaning in telugu

ఇక్కడ చాలామంది ఇలా అనుకుంటారు ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుంది అంటే ఆ కంపెనీ చాలా మంచిది లాభాలు సంపాదిస్తున్నది కాబట్టి ఏ కంపెనీ మంచిది అని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ అది అలా అన్నిసార్లు కరెక్ట్ కాదు ఇలా అంటే మనం పైన చెప్పుకున్న ఉదాహరణలు ఆ కంపెనీకి 2019, 2020 లో వచ్చిన లాభాలను 2021లో నష్టం వచ్చినా కూడా ఇచ్చారు మరియు ఇలా కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీకి భవిష్యత్తు లేదు అని అర్థం అవుతుంది. కాబట్టి మొత్తం ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ని డివిడెండ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కంపెనీ మంచిది కాదనే కదా అర్థం... కాబట్టి డివిడెండ్ ఇచ్చే ప్రతి కంపనీ మంచిది అని మనం నిర్ణయానికి రావద్దు.

అయితే ఇంకొక సందేహం dividends ఇవ్వని కంపెనీలు మనిషివి కావా?

లేదు, చాలా కంపెనీలు డివిడెండ్స్ అవ్వవు. అలా ఇవ్వకుండా అదే డబ్బులు మళ్ళీ పెట్టుబడి (REINVEST) చేసి కంపెనీని ఇంకా గ్రోత్ చేయాలని లేదా కొత్త పరికరాలు కొనడానికి ఆ డబ్బులను వాడుతుంటారు. అలా పెట్టుబడి చేసిన డివిడెండ్ తో కూడా లాభాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని కంపనీలు.

డివిడెండ్లకు అంత ప్రముక్యత ఉందా?

అయితే ఈ డివిడెండ్ల తో చిన్న చిన్న పెట్టుబడి దారులకు పెద్దగా వచ్చేది ఏమి లేక పోయినా, పెద్ద investors రాకేశ్ జుంజూంవాల, రాదాకిషన్ దామాని, లాంటి వారు ఒక కంపనీలో invest చేశారు అంటే కొన్ని లక్షల్లో షేర్లు కొంటు ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చే డివిడెండ్లు కూడా లక్షల్లో మరియు కోట్లల్లో ఉంటుంది. అందుకే ఈ డివిడెండ్ ఇచ్చే కంపనీలకు కొంచెం క్రేజ్ ఉంది అనె చెప్పుకోవాలి.

ఫైనల్ గా డివిడెండ్ ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి చేయటం మంచిదా లేదా యే డివిడెండ్ ఇవ్వని కంపెనీలలో పెట్టుబడి చేయటం మంచిదా అంటే? ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు ఏమంటారంటే కంపెనీలు డివిడెండ్స్ ఇవ్వకుండా ఆ డబ్బులను ఆ కంపనీని expand చేయటానికి ఉపయోగిస్తే.. దీర్గకాలంలో డివిడెండ్స్ కన్నా ఎక్కువ లాబాలను పొందవచ్చు అంటారు.  కాబట్టి మీరు ఈ విషయాని గుర్తు ఉంచుకొని మీ నిర్ణయాని తీస్కోండి.

ఇక్కడి వరకు వచ్చి  చదివినందుకు ధన్యవాదాలు.