how to buy and sell shares in upstox,u2dt

 షేర్ల ను ఎలా కొనాలి మరియు ఎలా అమ్మాలి అనే విషయాన్ని చాలా సులభమైన పద్ధతిలో చెప్పుకుందాం. ఈ టుటోరియల్ మనం UPSTOX అనే బ్రోకర్ అక్కౌంట్ లో చూపిస్తున్నాం.

STEP 1:-

అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక కింద ఫొటోలో చూపిన విధంగా హోం పేజ్ వస్తుంది. కుడి వైపు పైన "+" గుర్తు ఉంటుంది, ఆ గుర్తును ప్రెస్ చేయాలి.

how to buy and sell shares in upstox,u2dt

STEP 2:-

ఆ" + "సింబల్ ని ప్రెస్ చేసిన తరువాత, కింద ఫోటోలో చూపించిన విధంగా ఒక సర్చ్ బార్ వస్తుంది. ఇపుడు మీరు పెట్టుబడి లేదా ట్రేడింగ్ చేయాలనుకుంటున్న కంపెనీ పేరు ఆ సర్చ్ బార్ లో టైప్ చేస్తే, ఆ కంపెనీ పేరు వస్తుంది. ఆ కంపెనీ పేరు పక్కన ADD అని ఉంటుంది. దానిని టాప్ చేస్తే ఆ కంపనీ మీ watchlist లోకి యాడ్ అవుతుంది.

how to buy and sell shares in upstox,u2dt


how to buy and sell shares in upstox,u2dt
watchlist

STEP 3:-

ఇపుడు మీ watchlist లోకి యాడ్ అయిన తరువాత, ఆ కంపనీని పేరుని క్లిక్ చేయాలి. కింద ఫోటోలో చూపించిన విధంగా ఆ కంపెనీకి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. క్రింద ఫోటోలో చూపించిన విదంగా BUY మరియు SELL రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆ కంపనీ షేర్లను కోనాలి అనుకుంటే BUY ని టాప్ చేయాలి. లేదా అమ్మేయలి అనుకుంటే SELL ని టాప్ చేయండి.

how to buy and sell shares in upstox,u2dt

STEP 4:-

తర్వాత ఇలా క్రింద చూపిన విధంగా ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.  

how to buy and sell shares in upstox,u2dt

ఇందులో మొదటిది 

PRODUCT :- మీరు ఆ షేర్లను delivery అంటే ఒక రోజు కంటే ఎక్కువ రోజులు ఆ షేర్లను హోల్డ్ చేయాలి అనుకుంటే  delivery ని సెలెక్ట్ చేసుకోవాలి. intraday అంటే ఆ రోజే ఆ షేర్లను కొని ఆ రోజే అమ్మేయ్యాలి అనుకుంటే ఈ intraday ని సెలెక్ట్ చేసుకోవాలి. 

రెండవది

QUANTITY :- మీరు ఎన్ని షేర్లను కొనాలి అనుకుంటున్నారో ఆ సంఖ్యను దానిలో ఎంటర్ చేయాలి.:-

మూడవది

ORDER TYPE :- ఇందులో 

Limit order, Market order, Stop loss market, Stop loss limit ఇలా నాలుగు రకాల ఆప్షన్లు ఉంటాయి. 

ముందుగా......

Limit order :- మనం కోనాలి అనుకుంటున్న షేర్లను మనకు నచ్చిన ధరలో ఈ లిమిట్ ఆర్డర్ టైప్ ను సెలెక్ట్ కొనుకోవచ్చు. ఉదాహరణకు:- పైన ఫోటోలో రిలయన్స్ కంపనీ షేర్ ధర 2226.95 లో ట్రేడ్ అవుతుంది, కానీ మీరు 2220 ధరకి వస్తేనే కోనాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ లిమిట్ ఆర్డర్ ని సెలెక్ట్ చేసి అక్కడ 2220 ని ఎంటర్ చేస్తే ఆ కంపనీ షేర్ ధర ఎప్పుడతే 2220 కి వస్తుందో అప్పుడు మీ ఆర్డర్ ఒకే అవుతుంది.  

Market order :- మనం కోనాలి అనుకుంటున్న సమయంలో ఆ షేర్ ధర ఎక్కడ ఉంటే అక్కడ ఆ ధరలో ఆ షేర్ ను కొనమని ఈ మార్కెట్ ఆర్డర్ ఉద్దేశం. ఉదాహరణకు:- రిలయన్స్ పైన ఫోటోలో చూసూకుంటె ఆ సమయానికి 2226.95 ఉంది. ఈ మార్కెట్ ఆర్డర్ ను ఎన్నుకుని మనం ఆ షేర్ ను కోనాలి అని చూస్తే 2226.95 ధరలోనే మనకు ఆ షేర్లు వస్తాయి. 

Stop-loss market :-

ఈ టైప్ ఆర్డర్ను మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఒక ఉదాహరణతో చెప్పుకుందాం. మీరు intraday లో reliance కంపనీకి చెందిన 50 షేర్లను 2220 ధర వద్ద కొనుగోలు చేశారు.

మీ టెక్నికల్ అనాలసిస్ ప్రకారం రిలయన్స్ ధర 2215 అనేది stoploss. ఇపుడు ఆ షేర్ ధర 2220 నుండి 2215 వచ్చేంత వరక్ చూస్తూ కూర్చోలేము కాబట్టి ఈ stoploss market ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ stoploss market లో 2215 ను ప్రైస్ టచ్ అయితే ఆ సమయానికి  ఎంత ధరలో ఉంటే ఆ ధరలో ఎగ్జిట్ అవుతుంది. 

అలాగే ఈ stoploss market ని పోలినట్టే stoploss limit ఆర్డర్ కూడా ఉంటుంది, కానీ stoploss ధరకు వచ్చాక ఏ ధరలో ఎగ్జిట్ అవ్వాలి అని మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు :- రిలయన్స్ 2215 ధరకు వస్తే మార్కెట్ ధరకు ఎగ్జిట్ అవ్వమని stoploss market ఆర్డర్ లో చెపితే, షేర్ 2215 ధరకు వస్తే 2214 లో ఎగ్జిట్ అవ్వమని ఈ stoploss limit సెట్ చేసుకోవచ్చు. ఇలా stoploss ఆర్డర్లను ఎందుకు పెట్టాలి ఆ ధరకు వచ్చాక ఆ ట్రేడ్ నుండి మనమే ఎగ్జిట్ అవ్వచ్చు కదా అంటే, అయితే డిమాండ్ మరియు సప్లయ్ ద్వారా షేర్ ధర అనేది ప్రతి మిల్లీ సెకండ్ కి మారుతుంది కాబట్టి మీరు అనుకున్న లాస్ కంటే ఎక్కువ లాస్ కూడా అవ్వవచ్చు. కాబట్టి stoploss ని పెట్టడం మంచిది.


ఇది అండి ఈ ఆర్టికల్ కి, ధన్యవాదాలు.